Share News

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:55 PM

బ్రెజిల్ సెకండ్ డివిజన్ లీగ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. స్పోర్ట్ రెసిఫ్, నోవోరిజోంటినో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ప్రత్యర్థి జట్టు బంతిని తాకకుండానే పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్
Sport Recife own goal

స్పోర్ట్స్ డెస్క్: క్రీడల్లో అప్పుడప్పుడు జరిగే కొన్ని అరుదైన, విచిత్ర ఘటనలు మనల్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి తాజాగా బ్రెజిల్ సెకండ్ డివిజన్ లీగ్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా వింత ఘటన చోటుచేసుకుంది. స్పోర్ట్ రెసిఫ్, నోవోరిజోంటినో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ప్రత్యర్థి జట్టు బంతిని తాకకుండానే కేవలం నిమిషాల వ్యవధిలో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్పోర్ట్స్ రెసిఫ్ డిఫెండర్ చేసిన బ్యాక్ పాస్ కారణంగా ప్రత్యర్థికి గోల్ లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


స్పోర్ట్ రెసిఫ్ జట్టు డిఫెండర్ అలీసన్ కాసియానో బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలో సహచర ప్లేయర్లకు బంతిని పాస్ చేశాడు. మరికొద్ది సమయం తర్వాత తిరిగి అతడి వద్దకే బంతి వచ్చింది. ఈ క్రమంలో బంతిని గోల్‌కీపర్ కైక్ ఫ్రాంకాకు ఇవ్వాలని భావించాడు. అయితే కీపర్ సరైన స్థానంలో లేకపోవడంతో కాసియానో పాస్ చేసిన బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లి సెల్ఫ్ గోల్‌గా నమోదైంది. దీంతో బంతిని టచ్ చేయకుండానే ప్రత్యర్థి జట్టు నోవోరిజోంటినో ఖాతాలో ఒక గోల్ చేరింది. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫుట్ బాల్ క్రీడా రంగంలో ఇది అత్యంత చెత్త గోల్ అని కొందరు తెలిపారు. ఇలాంటి జట్టు ఉంటే...ప్రత్యర్థి బంతిని టచ్ చేయకుండానే గెలవచ్చంటూ మరికొందరు రెసిఫ్ జట్టుపై సెటైర్లు వేస్తున్నారు.


మరోవైపు, బ్రెజిల్ ఫుట్‌బాల్ గురించిన మరో ఆసక్తికరమైన వార్త భారతీయ క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కోల్‌కతాలో జరగనున్న భారత్-బ్రెజిల్ చారిత్రాత్మక అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌పై ఫుట్‌బాల్ ప్రేమికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. వివేకానంద యువ భారతి క్రీడాంగణం (VYBK) వేదికగా అక్టోబర్ 3న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన తక్కువ ధర టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి.


ఇవి కూడా చదవండి:

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు: సీఎం రేవంత్ ఆదేశం..

Updated Date - Sep 12 , 2026 | 04:02 PM