Share News

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:54 PM

కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన శాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది.

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
Indian-origin woman

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన శాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. శాక్రమెంటోలోని ఓ రెస్టారెంట్ వెలుపల రోహిత్(22) అనే యువకుడు శాలిని వెంబడించి కాల్చి చంపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిందితుడు పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రద్దీగా ఉండే హైవేపై పోలీసులు పట్టుకునే క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.


స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గతంలో అక్రమ వలసదారుడిగా పోలీసులు గుర్తించి నిర్భందించారు. శాక్రమెంటో ప్రాంతంలో శాలిని ఉద్యోగం చేస్తుంది. రోజు మాదిరిగానే విధుల నిమిత్తం వెళ్తున్న ఆమెను రెస్టారెంట్ వద్ద రోహిత్ అడ్డగించాడు. కాసేపు శాలినితో రోహిత్ వాగ్వాదం పెట్టుకున్నాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోతున్న శాలినిపై రోహిత్ పలుమార్లు కాల్పులు జరిపాడు. ఆమె కిందపడిన తర్వాత దగ్గరగా వచ్చి తలపై మరోసారి కాల్పులు జరిపాడు.


దీంతో శాలిని అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో ఓ ఆగి ఉన్న కారులో రోహిత్ శవమై కనిపించాడు. తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరికీ గతంలో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ ప్రవర్తన కారణంగా కొంతకాలంగా శాలిని అతడికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రోహిత్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కీలక పరిణామం.. కొండా సురేఖకు అధిష్ఠానం నుంచి పిలుపు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

Updated Date - Sep 12 , 2026 | 02:58 PM