Share News

ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:52 PM

దేశం ఆయుష్మాన్ భారత్‌గా మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఆయన ప్రకటించారు.

ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడ, సెప్టెంబర్ 12: దేశం ఆయుష్మాన్ భారత్‌గా మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఆయన ప్రకటించారు. శనివారం విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్రవ్యాప్తంగా10 క్రిటికల్ కేర్ బ్లాకులు,12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో 9 క్రిటికల్ కేర్ యూనిట్లు ప్రారంభించుకున్నామని తెలిపారు.


22 ప్రాజెక్టులకు రూ.249 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. నడ్డా నాయకత్వంలో దేశ ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కేంద్రం పెను మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంతో అనేక మందికి ప్రయోజనం చేకూరుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.


అర్హులైన వారికి రూ.5లక్షల ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. గతంలో దేశంలో 51వేల MBBS సీట్లు మాత్రమే ఉండేవని.. కానీ ప్రధాని మోదీ నేతృత్వంలో అవి లక్షా 18వేలకు పెరిగాయని వివరించారు. సంజీవని ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో మన దేశం నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్‌గా ఉండాలని అన్నారు. అమరావతి పేరు లద్దాఖ్ వరకు వినిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీకి కేరాఫ్ అమరావతి అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కీలక పరిణామం.. కొండా సురేఖకు అధిష్ఠానం నుంచి పిలుపు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

For More AP News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 02:06 PM