తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:58 AM
తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు.
అమరావతి, సెప్టెంబర్ 12: తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ చైర్మన్, ఈవోతోపాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకీదేవితోపాటు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.
అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు చర్చించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై వారికి సీఎం దిశానిర్దేశం చేశారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మరో వైపు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు తెలియజేసేందుకు ఇప్పటికే టీటీడీ బుక్ లెట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఆర్థిక ప్రగతికి హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం: మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
For More AP News And Telugu News