Share News

బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ABN , Publish Date - Sep 12 , 2026 | 10:11 AM

22ఏ సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు.

బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
mla anirudh reddy

హైదరాబాద్, సెప్టెంబర్12: 22ఏ సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఈ 22ఏ పై ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు. శనివారం అసెంబ్లీ వద్ద విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల భూదందాల భాగోతం మొత్తం బయటపెడతామని తెలిపారు. వాళ్ల హయాంలోనే ప్రభుత్వ భూముల్లో వెంచర్స్ చేశారని విమర్శించారు. వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.


భూబకాసురులు మేం కాదని.. గత పదేళ్ల నాయకులే దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. 22ఏ పై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ 22ఏలో కోటి16 లక్షల ఎకరాలు ఉన్నాయనేది అబద్ధమని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా జరిగిన తప్పుల వల్లే నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఆర్థిక ప్రగతికి హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం: మంత్రి శ్రీధర్ బాబు

బొల్లారం ఆయుధాల చోరీ.. మల్లేశ్‌కు రిమాండ్ విధించిన కోర్టు

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 11:40 AM