ఐపీఎల్ ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్..నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి..!
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:33 PM
ఐపీఎల్(IPL Auction 2027)కు సంబంధించిన అప్‌డేట్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ లీగ్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్(IPL Auction 2027)కు సంబంధించిన అప్‌డేట్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ లీగ్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఐపీఎల్- 2027 సీజన్‌కు సంబంధించి మినీ వేలం ప్రక్రియను డిసెంబరు 16న గోవా వేదికగా నిర్వహించనున్నారు. ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాలని తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్ని ఫ్రాంఛైజీలకు సూచించింది.
రిటైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ జట్టులో ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు, ఎన్ని స్లాట్‌లు ఖాళీలున్నాయి అనే దానిపై స్పష్టత వస్తుంది. తర్వాత ఆయా జట్ల నుంచి రిలీజైన ఆటగాళ్లు వేలంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అనంతరం వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంఛైజీలకు అందిస్తుంది. తర్వాత ఆ జాబితాను షార్ట్ లిస్ట్ చేసి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తుంది. గత మూడు సీజన్ల తర్వాత ఐపీఎల్ వేలం తొలిసారి భారత్‌లో నిర్వహించడం విశేషం. 2024లో దుబాయ్, 2025లో జెడ్డా, 2026లో అబుదాబీ వేదికగా ఆక్షన్ నిర్వహించారు.
మరోవైపు ఐపీఎల్-2027 సీజన్ షెడ్యూల్‌ను ఇంకా ఖరారు కాలేదు. 2025, 2026, 2027 సీజన్ల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గతంలో మార్చి 14 నుంచి మే 30 వరకు విండోను నిర్దేశించింది. అయితే 2026 సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్-2027 సీజన్ మార్చి 14న కాకుండా మార్చి నెలాఖరులో ప్రారంభం కావచ్చని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా సూచించారు.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..
పాక్ గడ్డపై డకెట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లాండ్ బ్యాటర్..!