డ్రా అయినా టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 మంది బౌలర్లు!
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:41 PM
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా ముగిసింది. విజయం కోసం టీమిండియా చివరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ భారత్ మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా ముగిసింది. విజయం కోసం టీమిండియా చివరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ భారత్ మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెల్లింగ్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎనిమిది మందితో బౌలింగ్ చేయించాడు. ఇలా ఒక టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ బౌలర్లను ఉపయోగించడం ఇది 28వ సారి.
కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. రెగ్యులర్ బౌలర్స్ అయిన బుమ్రా (20 ఓవర్లు) , ఆకాశ్ దీప్ (20 ఓవర్లు), అన్షుల్ కాంబోజ్ (22 ఓవర్లు), ప్రసిధ్ క్రిష్ణ (19 ఓవర్లు), వాషింగ్టన్ సుందర్ (35 ఓవర్లు) బౌలింగ్ వేశారు. వీరికి అదనంగా పడిక్కల్ (ఒక ఓవర్), జైస్వాల్ (రెండు ఓవర్లు), ధ్రువ్ జురెల్ (ఒక ఓవర్) తమ వంతుగా బౌలింగ్ ప్రదర్శన చేశారు.
ఇక చివరగా ఈ ఏడాది ఆగస్టులో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ తరఫున ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మందితో బౌలింగ్ చేశారు. గతంలో రెండు సందర్భాల్లో మాత్రమే రెండు వరుస టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది భారత బౌలర్లు బౌలింగ్ వేశారు. 1952 డిసెంబర్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో టెస్టులో, ఆ తర్వాత వెంటనే 1953 జనవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా ఈ ప్రయోగం చేసింది.
ఆ తర్వాత 1963, 1964లో ఇంగ్లండ్‌తో రెండు వరుస టెస్టుల్లో ఇలాగే భారత్ నుంచి ఎనిమిది మంది బౌలింగ్ వేయడం విశేషం. అలానే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 42 మెయిడెన్ ఓవర్లు వేసింది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒక ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లు మెయిడెన్లు వేయడం విశేషం.
ఇవి కూడా చదవండి:
దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం