పోరాడినా.. భారత్ ‘ఎ’ జట్టుకు ఓటమి
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:23 AM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ పరాజయం చవిచూసింది. ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పాకిస్థాన్..
తిలక్ సెంచరీ
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ పరాజయం చవిచూసింది. ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పాకిస్థాన్ 48 పరుగులతో నెగ్గింది. తొలుత పాకిస్థాన్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. భారీ ఛేదనలో భారత్ ‘ఎ’ 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (100) సెంచరీ చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (70), షాబాజ్ అహ్మద్ (56) పోరాడారు. 26/2తో కష్టాల్లో పడిన దశలో అభిషేక్-తిలక్ మూడో వికెట్‌కు 67 పరుగులతో పరిస్థితి చక్కదిద్దారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ‘ఎ’ 129/6తో నిలిచింది. కానీ తిలక్, షాబాజ్ ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపారు. అయితే షాబాజ్ అవుట్ కావడంతో భారత్ ‘ఎ’ ఆశలు అడుగంటాయి.
సంక్షిప్తస్కోర్లు
పాకిస్థాన్ ‘ఎ’: 49.2 ఓవర్లలో 313 ఆలౌట్ (హసన్ నవాజ్ 79, మాజ్ సాదకత్ 59, ఫర్హాన్ యూసఫ్ 56, విప్రజ్ నిగమ్ 2/46, సూర్యాన్ష్ షెగ్డే 2/55, ప్రిన్స్ యాదవ్ 2/60, హర్షిత్ రాణా 2/77).
భారత్ ‘ఎ’: 49.1 ఓవర్లలో 265 ఆలౌట్ (తిలక్ వర్మ 100, అభిషేక్ 70, షాబాజ్ అహ్మద్ 56, హసన్ నవాజ్ 3/45, అలీ రజా 3/56, ఇమ్రాన్ 2/69).
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్