Share News

సెమీస్‌కు మనమ్మాయిలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:21 AM

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్‌ విజయాలతో...

సెమీస్‌కు మనమ్మాయిలు

థాయ్‌లాండ్‌పై7-0తో విజయం

హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ

భోపాల్‌: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో భారత్‌ 7-0తో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. దీపిక హ్యాట్రిక్‌ గోల్స్‌తో విజృంభించగా, నవ్‌నీత్‌ కౌర్‌ రెండు గోల్స్‌తో చెలరేగింది. ముంతాజ్‌, సునెలిటా టొప్పొ చెరో గోల్‌ చేశారు. అంతకుముందు మలేసియా, దక్షిణ కొరియాలపై గెలిచిన భారత అమ్మాయిలు.. వరుసగా మూడో గెలుపుతో మరో రెండు మ్యాచ్‌లుండగానే సెమీస్‌లో అడుగుపెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 05:21 AM