Share News

టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా..

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:41 AM

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా..
India Test Record

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా.. ఆదివారం నాలుగో రోజు రెండో సెషన్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే టెస్ట్ చరిత్రలోనే నిలిచిపోయే ఓ అరుదైన రికార్డును భారత్ నమోదు చేసింది.


టెస్టు చరిత్రలోనే తొలిసారిగా ఒకే ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా టెస్టు ఇన్నింగ్స్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు ఏడు లేదా అంతకంటే ఎక్కువ 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జట్టుగానూ భారత్ నిలిచింది. గతంలో 2007లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత్ ఈ ఘనతను సాధించింది. అప్పుడు టీమిండియా ఒకే ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఎనిమిది భాగస్వామ్యాలను నమోదు చేసింది.


అలానే న్యూజిలాండ్ గడ్డపై భారత్ సాధించిన 720 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో 2019లో హామిల్టన్‌లో బంగ్లాదేశ్‌పై కివీస్ చేసిన 715/6 డిక్లేర్డ్ రికార్డును భారత్ అధిగమించింది. కివీస్‌పై టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. గతంలో 1995లో వెల్లింగ్టన్‌లోనే వెస్టిండీస్ 660/5 డిక్లేర్డ్ చేసింది. తాజాగా ఆ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. మరోవైపు విదేశాల్లో భారత్‌కు ఇదే అత్యధిక టెస్టు స్కోరు కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

వంద రోజులుగా ప్రొరోగ్‌ కాని పార్లమెంటు

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 22 , 2026 | 08:51 AM