బెదిరించేవారు..అవమానించేవారు
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:03 AM
ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ నాయకత్వ శైలిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
న్యూఢిల్లీ, నవంబరు 21: ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ నాయకత్వ శైలిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులను బహిరంగంగా అవమానించడం, వ్యక్తిగతంగా దూషించడం, శారీరక హాని చేస్తానని బెదిరించడం ఆయనకు అలవాటుగా ఉండేదని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
రెండు దశాబ్దాల క్రితం నాటి ఈ ఆరోపణలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఎన్విడియా విలువ పెరిగి ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత డబ్బుతో వారిని ప్రోత్సహించడం సాధ్యం కాదని, అవమానించడం ద్వారానే మెరుగైన పనితీరు రాబట్టబచ్చని హువాంగ్ భావించినట్లు కథనం పేర్కొంది. తోటి ఉద్యోగుల ముందు దూషించడంతో పాటు శారీరకంగా హాని చేస్తానంటూ బెదిరించిన సందర్భాలున్నాయని 12 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు తెలిపినట్లు వెల్లడించింది. ఓ ఉద్యోగి తల్లిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, మరో ఉద్యోగి చేతులను విరిచి వాటితోనే అతడిని కొడతానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.