Share News

నీట్‌ పేపరు లీకేజీ కేసులో14 మందిపై అభియోగాల నమోదు

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:06 AM

నీట్‌ పేపరు లీకేజీ కేసులో 14 మంది నిందితులపై స్థానిక ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం శనివారం అభియోగాలను నమోదు చేసింది.

నీట్‌ పేపరు లీకేజీ కేసులో14 మందిపై అభియోగాల నమోదు

  • నీట్‌ పేపరు లీకేజీ కేసులో14 మందిపై అభియోగాల నమోదు

న్యూఢిల్లీ, నవంబరు 21: నీట్‌ పేపరు లీకేజీ కేసులో 14 మంది నిందితులపై స్థానిక ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక న్యాయస్థానం శనివారం అభియోగాలను నమోదు చేసింది. దీంతో కోర్టులో విచారణకు రంగం సిద్ధమయింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని నిందితులు వాదించినప్పటికీ ప్రత్యేక జడ్జి అజయ్‌ గుప్తా మాత్రం వారు పలు నేరాలు చేసినట్టు ప్రాథమిక పరిశీలన ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. మోసం, అవినీతి, పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడడం వంటి అభియోగాలు మోపారు. ఎన్‌టీఏ తరఫున ప్రశ్నపత్రాల రూపకల్పన విధులు నిర్వర్తించిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మనీషా గురునాథ్‌ మంధారే, పి.వి.కులకర్ణి, మనీషా సంజయ్‌ హవల్దార్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 08:07 AM