వైభవ్ అద్భుత ప్లేయర్.. అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 02:10 PM
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కేవలం ఒక్కరిపైనే ఉంది. అతడే...
స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కేవలం ఒక్కరిపైనే ఉంది. అతడే కేవలం 15 ఏళ్ల వయసులో అద్భుతాలు సృష్టిస్తున్న భారత యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్‌తో పాటు వివిధ టోర్నీల్లో అంచనాలకు మించి రాణించాడు. ఇకవ వైభవ్ ముప్పును ఎదుర్కొనేందుకు అఫ్గానిస్థాన్ జట్టు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది.
ఇవాళ జరిగిన ప్రెస్ మీట్‌లో అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ ఒక అసాధారణ ప్రతిభావంతుడని ప్రశంసించాడు. ఐపీఎల్‌లో అతడితో ఆడిన ఆటగాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపాడు. అలాగే వైభవ్ బలాలు, బలహీనతలను అంచనా వేయడానికి అతడికి సంబంధించిన అనేక వీడియోలను పరిశీలించినట్లు తెలిపారు. వైభవ్ కోసం రచించిన వ్యూహాలను మైదానంలో కచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామని జద్రాన్ స్పష్టం చేశాడు.
ఇక రషీద్ ఖాన్ స్థానంలో ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్ సారథిగా బాధ్యతలు చేపట్టిన ఇబ్రహీం జద్రాన్ తన కెప్టెన్సీ విధానంపై స్పందించాడు. కెప్టెన్సీ అనేది తనకు పెద్ద బాధ్యత అని, ఒత్తిడి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. తమకు భారత్ లో పరిస్థితులు బాగా తెలుసనని, ఫలితం గురించి ఆలోచించకుండా ప్రక్రియపై దృష్టి పెట్టి వంద శాతం ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. శ్రేయస్ సేనను, వైభవ్ సూర్యవంశీ జోరును అఫ్గాన్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!
భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం