టిమ్స్‌లో రాష్ట్రస్థాయి మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభం..
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:29 PM
హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో రాష్ట్రస్థాయి మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ఆస్పత్రికి చేరుకుని వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో రాష్ట్రస్థాయి మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్ ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇవాళ (ఆదివారం) ఆస్పత్రికి చేరుకుని వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆయన పరిశీలించారు. వాటి వినియోగంపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంపై రాజనర్సింహ చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వాణి, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ బీరప్ప, డాక్టర్ విమల థామస్, డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..