Share News

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:24 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో వ్యభిచారం గుట్టురట్టయింది. ఓ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనే పక్కా సమాచారంతో శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో పలువురు విదేశీ యువతులను గుర్తించారు.

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..
Shamshabad News

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో వ్యభిచారం గుట్టురట్టయింది. ఓ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనే పక్కా సమాచారంతో శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో పలువురు విదేశీ యువతులను గుర్తించారు. ఈ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు.. వ్యభిచార కేంద్రం నిర్వహణ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే, హోటల్‌లోకి విదేశీ యువతులను ఎలా తీసుకువచ్చారు?, యువతులు ఏయే దేశాలకు చెందినవారనే విషయాలను తెలుసుకుంటున్నారు. కాగా, దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Updated Date - Sep 13 , 2026 | 11:49 AM