నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..
ABN , Publish Date - Sep 13 , 2026 | 10:38 AM
నిరుద్యోగ యువత జీవితాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆటలాడటం సమంజసం కాదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ నీళ్లు చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: నిరుద్యోగ యువత జీవితాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆటలాడటం సమంజసం కాదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ నీళ్లు చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి, పరీక్షలు రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులతో రాజకీయాలు చేయడం సరికాదని అనిత పేర్కొన్నారు.
యువత భవిష్యత్తుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్ జగన్ చూస్తున్నారని అనిత మండిపడ్డారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రతి అడుగులోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. అర్హత, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు..
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి