Share News

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన టీడీపీ నేత చిన్న శ్రీను

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:20 PM

విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన టీడీపీ నేత చిన్న శ్రీను
Chinna Srinu

విజయనగరం, సెప్టెంబర్13: జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత చిన్న శ్రీను, ఆయన కుమార్తె శిరిసహస్ర గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గోవాలోని గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను కుటుంబానికి అశోక్ గజపతిరాజు, టీడీపీ ఎమ్మెల్యే అదితివిజయలక్ష్మి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.


ఈ భేటీ అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ.. పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఆదేశాలతో పాటు అశోక్ గజపతిరాజు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని తెలిపారు. అశోక్ గజపతి రాజు ఆశీస్సులు, మార్గదర్శకత్వం కోసమే ఈ సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో అతడు టీడీపీ కండువా కప్పుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

Updated Date - Sep 13 , 2026 | 02:23 PM