Share News

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:36 PM

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన విదేశీ పర్యటనలకు మాడిఫై చేసిన బోయింగ్ 747-8 విమానాన్ని వాడుతున్నారు. ఈ ఫ్లైట్‌ను ఎయిర్ చైనా ఆపరేట్ చేస్తుంది.

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన విదేశీ పర్యటనలకు మాడిఫై చేసిన బోయింగ్ 747-8 విమానాన్ని వాడుతున్నారు. ఈ ఫ్లైట్‌ను ఎయిర్ చైనా ఆపరేట్ చేస్తుంది. 2014 డిసెంబరులో కమర్షియల్ ప్యాసింజర్ జెట్‌గా ఈ విమానం ఎయిర్ చైనాతో కలిసి తన జర్నీని ప్రారంభించింది. 2015 మే నెలలో దీనిని కమర్షియల్ సర్వీస్ నుంచి శాశ్వతంగా విత్‌డ్రా చేశారు. కొన్ని నెలలపాటు విమానంలో పలు మార్పులు చేర్పులు చేశారు. లోపల లగ్జరీ వీఐపీ ఇంటీరియర్ ఏర్పాటు చేశారు.

2016లో ఈ విమానం ప్రైమరీ స్టేట్ ఎయిర్ క్రాఫ్ట్(ప్రభుత్వాధీనంలో నడిచేది)గా తన సర్వీసును ప్రారంభించింది. ఇంతకుముందు చైనా లీడర్లు బోయింగ్ 747-400ఎస్ విమానాన్ని వాడేవారు. అధినేతలు తమ దౌత్యపరమైన మిషన్ల పర్యటనలకు వెళ్లడానికి 20 రోజుల ముందే చైనా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వాటిని తాత్కాలికంగా వీవీఐపీ క్యాబిన్లతో రీఫిట్ చేసేవారు. పర్యటనలు ముగిసిన తర్వాత మళ్లీ స్టాండర్డ్ ప్యాసింజర్ ఫ్లైట్‌గా మార్చేవారు. కమర్షియల్ జెట్లను వాడడంతో డబ్బు ఆదా అయ్యేది.


ప్రస్తుతం జిన్ పింగ్ వాడుతున్న బోయింగ్ 747-8 ప్రత్యేకతలివే..

  • పొడవు: 76.4 మీటర్లు

  • మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్: 4,42,000 కిలోలు

  • ఇంజిన్లు: నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ జెనెక్స్-2బీ67 టర్బోఫ్యాన్ ఇంజిన్లు

  • మ్యాగ్జిమమ్ స్పీడ్: గంటకు 982 కిలోమీటర్లు

  • రేంజ్: రీఫ్యుయెల్ చేయకుండా దాదాపు 14,500 కిలోమీటర్లు

  • అత్యాధునిక సదుపాయాలతో మాడిఫికేషన్


జిన్‌పింగ్ వాడుతున్న బోయింగ్ 747-8 విమానంలో శాటిలైట్ బేస్డ్, మిలిటరీ గ్రేడ్ ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి సదుపాయాలతో మాడిఫై చేశారు. ఈ సదుపాయాలతో ప్రభుత్వం, మిలిటరీ కమాండ్ సెంటర్లతో అధ్యక్షుడు ఎప్పటికపుడు కాంటాక్టులు చేయవచ్చు. విమానానికి ఏమైనా ముప్పుందని అనుమానం కలిగితే ముందుగానే హెచ్చరిక జారీచేసే వ్యవస్థతో పాటు మిసైళ్ల దాడులను తిప్పికొట్టే వ్యవస్థ కూడా ఇందులో ఉంది. అలాగే ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పల్స్(ఈఎంపీ)షీల్డింగ్ కూడా ఈ విమానం సొంతం. దీనితో న్యూక్లియర్ దాడుల నుంచి విమానాన్ని తప్పించవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేసే శక్తిమంతమైన ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఎనర్జీ పేలుళ్ల నుంచి విమానానికి రక్షణ కల్పించే వ్యవస్థే ఈఎంపీ షీల్డింగ్. అధ్యక్షుడు, ప్రధాని మాత్రమే తమ అంతర్జాతీయ పర్యటనల కోసం ఈ విమానాన్ని వాడేందుకు దీనికి అనుమతి ఉంది. ఇతర లీడర్లు తమ పర్యటనల కోసం చార్టర్డ్ ఫ్లైట్లను వాడతారు. కాగా.. అంతకుముందు చైనా అధ్యక్షుడు తన అధికారిక పర్యటనల కోసం కమర్షియల్ బోయింగ్ 747-400ఎస్‌లో ప్రయాణించేవారు.


ఇవీ చదవండి:

రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్

ఐర్లాండ్ వ్యక్తి ప్రశ్నకు గ్రోక్ అద్భుత సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందనిదే..

Updated Date - Sep 13 , 2026 | 12:37 PM