Share News

భారీ డీల్‌కు సిద్ధమైన ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలు!

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:40 PM

ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ట్రేడ్ మార్కెట్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రిటెన్షన్ గడువు ముగిసేలోపు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఒక భారీ ట్రేడింగ్ ఒప్పందం కుదరనున్నట్లు సమాచారం.

భారీ డీల్‌కు సిద్ధమైన ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలు!
Hardik Pandya Trade

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ట్రేడ్ మార్కెట్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రిటెన్షన్ గడువు ముగిసేలోపు ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య ఒక భారీ ట్రేడింగ్ ఒప్పందం కుదరనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ స్పోర్ట్స్ మీడియా నివేదికల ప్రకారం.. ముంబై స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీల్‌లో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్-బ్యాటర్ విష్ణు వినోద్‌లు ముంబై జట్టులోకి మారనున్నట్లు తెలుస్తోంది.


ఐపీఎల్ 2026 ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు కూడా హార్దిక్‌ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపించాయి. అయితే చివరికి పంజాబ్ కింగ్స్‌తోనే ముంబై యాజమాన్యం చర్చలు తుది దశకు చేర్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత ట్రేడ్‌కు సంబంధించి ఇరు ఫ్రాంచైజీల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


మరోవైపు, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2026 తర్వాత నుంచి పూర్తిగా ఆటకు దూరంగా ఉంటున్నప్పటికీ, అతడి అనుభవంపై నమ్మకంతో పంజాబ్ జట్టులోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ ట్రేడ్ నిజమైతే... ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలన ఒప్పందాలలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాక ఈ డీల్ ఇతర జట్ల వ్యూహాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మార్కస్ స్టోయినిస్ బదులుగా మోసిన్ ఖాన్‌ను ట్రేడ్ చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 17లోపు రిటెన్షన్ జాబితాలు వెలువడనుండటంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్: భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా 84 లక్షల దరఖాస్తులు!

యశస్వి 155 పరుగులు.. న్యూజిలాండ్‌తో టెస్టులకు అవకాశం దక్కుతుందా?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై గిల్ క్లారిటీ

Updated Date - Nov 03 , 2026 | 03:40 PM