క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ వీడ్కోలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:01 AM
ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (38) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (38) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాక్సీ 2012లో ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా, గతేడాది జూన్‌లో వన్డేల నుంచి వైదొలిగాడు. అప్పటి నుంచి టీ20లకే పరిమితమైన తను ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. కెరీర్‌లో 7 టెస్టుల్లో 339, 149 వన్డేల్లో 4 శతకాలతో 3990, 130 టీ20ల్లో 5 సెంచరీలతో 2897 పరుగులు సాధించాడు. 2015, 2023 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన కంగారూ జట్టు సభ్యుడు. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్‌పై 128 బంతుల్లోనే 201 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి:
14 బంతుల్లో 50 ప్రేమా రావత్ రికార్డు
డబ్బులు లేకుండా చెక్కులు ఇవ్వొద్దు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News