Share News

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ABN , Publish Date - Aug 22 , 2026 | 07:23 AM

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయ‌గా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్
Joe Root

స్పోర్ట్స్ డెస్క్: లీడ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఆటలో అర్ధ సెంచరీ చేసి.. అత్యధిక హాఫ్ సెంచరీలు(68) చేసిన వారి జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‍తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా మరో అరుదైన ఘనతను జో రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.


టెస్టు ఫార్మాట్ లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ అజాన్ అవాయిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో రూట్ ఈ అరుదైన రికారక్డును నమోదు చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటివరకు 219 టెస్టు క్యాచ్‌లను అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (218 క్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా అజాన్ అవాయిస్ క్యాచ్‌తో స్మిత్ ప్రపంచ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. ఇక లీడ్స్ టెస్టులో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 103 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది.


టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు

  • జో రూట్ (ఇంగ్లండ్‌)-219

  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-218

  • రాహుల్ ద్రవిడ్ (భారత్)-210

  • మహేళ జయవర్ధనే (శ్రీలంక)-205

  • జాక్వెస్ కల్లిస్‌ (సౌతాఫ్రికా)- 200


ఇవి కూడా చదవండి:

పతకం ఖాయం చేశారు

నుంచి సాత్విక్-చిరాగ్ ఔట్

Updated Date - Aug 22 , 2026 | 07:34 AM