Share News

16 ఏళ్లుగా మారని పాకిస్థాన్ రాత.. ఇంగ్లండ్‌ గడ్డపై కొనసాగుతున్న చెత్త రికార్డు!

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:31 PM

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఇంకా కొనసాగిస్తోంది. 16 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టు.. టెస్టుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోతోంది.

16 ఏళ్లుగా మారని పాకిస్థాన్ రాత.. ఇంగ్లండ్‌ గడ్డపై కొనసాగుతున్న చెత్త రికార్డు!
Pakistan vs England

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును ఇంకా కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌తో హెడింగ్లీలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ డకౌట్ కావడంతో.. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో 50కిపైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం కోసం పాకిస్థాన్ ఎదురుచూపులు 27 ఇన్నింగ్స్‌లకు చేరాయి. పాకిస్థాన్ తరఫున చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం 2010లో నమోదైంది. హెడింగ్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సల్మాన్ బట్–ఇమ్రాన్ ఫర్హత్ జోడీ 56 పరుగులు జోడించింది. 16 ఏళ్లుగా పాక్ ఓపెనర్లు ఆ ఘనతను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు.


పాక్ ఘోర ఓటమి

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 171 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసి.. పాక్‌పై 238 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మహ్మద్ రిజ్వాన్(41) మినహా ఎవరూ రాణించలేదు. ఓలీ, ఆర్చర్, టంగ్ తలో మూడు, అట్కిన్‌సన్ 1 వికెట్ పడగొట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే పాక్ ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో పాటు 103 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

Updated Date - Aug 21 , 2026 | 09:38 PM