Share News

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సాత్విక్-చిరాగ్ ఔట్

ABN , Publish Date - Aug 21 , 2026 | 08:37 PM

భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: టోర్నీ నుంచి సాత్విక్-చిరాగ్ ఔట్
Satwik Sai Raj Rankireddy, Chirag Shetty

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిశాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్-5గా ఉన్న సాత్విక్–చిరాగ్ 36 నిమిషాల్లో 18–21, 9–21 తేడాతో పరాజయం చవి చూశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆశించిన స్థాయిలో పదును చూపలేకపోయిన భారత జోడీ.. రెండో గేమ్‌లో పూర్తిగా వెనుకబడింది.


2022, 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్–చిరాగ్.. ఈసారి మూడో పతకంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్–వాంగ్ జోడీ ముందు భారత జంటకు ఎదురుదెబ్బ తగిలింది.


ఇవి కూడా చదవండి:

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే

Updated Date - Aug 21 , 2026 | 08:37 PM