భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్: షెడ్యూల్‌లో మార్పులు?
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:21 PM
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్‌షిప్‌పై కన్ను
గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్‌షిప్‌తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్‌ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి.
బీసీసీఐ నిర్ణయంపైనే ఉత్కంఠ
భారత్‌కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇవి కూడా చదవండి:
కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే