ఇది టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కాదు: శ్రీలంక మాజీ క్రికెటర్
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:06 PM
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టినా.. బ్యాటింగ్‌పై మాత్రం శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ప్రశ్నలు సంధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టినా.. బ్యాటింగ్‌పై మాత్రం శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ప్రశ్నలు సంధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 193 పరుగులకే ఆలౌటైంది. భారత్.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చారని ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డాడు.
‘దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ భాగస్వామ్యాన్ని పక్కన పెడితే.. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. భారత జట్టులో శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించకపోయినా భారత్ మంచి స్కోరు సాధించింది. అది జట్టు బలాన్ని చూపిస్తుంది. కానీ బ్యాటింగ్ పరంగా ఇది టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన మాత్రం కాదు. ఇప్పుడు వాళ్లు భారీ తేడాతో విజయం సాధించారు కాబట్టి.. జట్టులో ఉన్న లోటుపాట్లను ఎవ్వరూ ఎత్తి చూపరు’ అని ఆర్నాల్డ్ వెల్లడించాడు.
కొలంబోలో శ్రీలంక పుంజుకుంటుందా?
ఈ సిరీస్‌లో రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు శ్రీలంకకు రెండో టెస్టు కీలకంగా మారింది. గాలేలో అన్ని విభాగాల్లో విఫలమైన ఆ జట్టు.. కొలంబోలో తమ ఆటతీరును పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి సొంత గడ్డపై ఆతిథ్య జట్టు పుంజుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం