'యూనివర్స్ బాస్'కు బ్రావో పాదాభివందనం.. నెట్టింట వైరల్ వీడియో!
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:36 PM
అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. ఒక్లాండ్ వేదికగా మరికాసేపట్లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్- వాషింగ్టన్ ఫ్రీడం టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి.
స్పోర్ట్స్ డెస్క్: అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. ఒక్లాండ్ వేదికగా మరికాసేపట్లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్- వాషింగ్టన్ ఫ్రీడం టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మెగా ఫైనల్‌కు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ డ్వెన్ బ్రావో.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా గేల్‌ను ఆహ్వానిస్తూ అతడి పాదాలకు బ్రావో నమస్కరించాడు. అంతేకాదు గేల్ ను అక్కడున్న వారికి చూపిస్తూ.. అసలైన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్)గా అభివర్ణించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కరేబియన్ దిగ్గజాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బ్రావో మార్గదర్శనంలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ ఎంఎల్సీ-2026లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా.. ఏకంగా ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఇవాళ(శనివారం) రాత్రి 11:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.
లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రసెల్ కీలక పాత్ర పోషించాడు. సీజన్ ఆసాంతం.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో రసెల్ చక్కటి ప్రదర్శన చేశాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక లాస్ ఏంజెల్స్ జట్టుకు మరో విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ కెప్టెన్‌గా ఉండటం విశేషం. మరోవైపు.. రోవ్‌మన్ పావెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి మ్యాచ్‌లు గెలిపించాడు. మొత్తంగా కరేబియన్ వీరులంతా కలిసి తొలిసారి లాస్ ఏంజెల్స్ జట్టును ఫైనల్‌కు చేర్చగా.. క్రిస్ గేల్ వారిని ఉత్సాహపరిచేందుకు మైదానానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!