Share News

యామల్‌కు హెయిర్‌కట్ చేయడానికి రోల్స్ రాయిస్‌లో వచ్చిన బార్బర్

ABN , Publish Date - Jul 18 , 2026 | 08:18 PM

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తుది పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యామల్ సరికొత్త హెయిర్‌కట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

యామల్‌కు హెయిర్‌కట్ చేయడానికి రోల్స్ రాయిస్‌లో వచ్చిన బార్బర్
Lamine Yamal

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తుది పోరులో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యామల్ సరికొత్త హెయిర్‌కట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఫుట్‌బాల్ ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం తమ లుక్స్ మార్చుకోవడం సర్వసాధారణమే అయినప్పటికీ యామల్‌కు ట్రిమ్ చేయడానికి బార్బర్ వచ్చిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు ఏకంగా లగ్జరీ కారు 'రోల్స్ రాయిస్'లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఫ్యాషన్ రంగంలో ఎంతో పేరుగాంచిన అమెరికాకు చెందిన 22 ఏళ్ల సెలబ్రిటీ బార్బర్ బ్రయాన్ గార్డెడో ఈ వేసవిలో స్పెయిన్ జాతీయ జట్టుకు అధికారిక స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం ఆయన రోల్స్ రాయిస్ కారులో స్పెయిన్ జట్టు బస చేసి హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ యామల్‌కు హెయిర్‌కటింగ్ చేశాడు. అనంతరం యామల్ ఆ ఫేమస్ బార్బర్‌కు తన సంతకంతో కూడిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాక సదరు బార్బర్ కోరికమేరకు ఓ ఫొటో కూడా దిగాడు. బార్బర్ రోల్స్ రాయిల్


మరోవైపు ఈ చరిత్రాత్మక ఫైనల్ పోరుకు ముందు అర్జెంటీనా కెప్టెన్, దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సి యామల్‌పై ప్రశంసలు కురిపించాడు. యామల్ ఒక 'అద్భుతమైన' ఆటగాడని కొనియాడాడు. ఫైనల్లో అతడు సరికొత్త మైలురాళ్లను అందుకోకుండా అడ్డుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని మెస్సి వ్యాఖ్యానించడం విశేషం. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ యామల్ క్రేజ్ చూస్తుంటే, ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 18 , 2026 | 09:29 PM