Share News

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:50 PM

ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ పరాజయంపై మాజీ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్ స్పందించారు.

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు
Dinesh Karthik

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియాకు (India) దారుణమైన పరాభవం ఎదురైంది. నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ పరాజయంపై మాజీ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్ స్పందించారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని అతడు విమర్శించాడు.


మ్యాచ్ సమయంలో ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌లో అతడు ప్రత్యక్ష ప్రసారంలో ఉండగా ఆగ్రహానికి గురై, దూబే కంటే ముందు రాణాను పంపాలన్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడమా, మీరు నన్ను ఆటపట్టిస్తున్నారా?' అని కార్తీక్ లైవ్‌లో అనడం వినిపించింది. 'దేశీయ క్రికెట్‌లో కూడా హర్షిత్ రాణా పవర్ ప్లేలో ఎప్పుడూ బ్యాటింగ్ చేసినట్లు చూడలేదు. టీ20ల్లో కుడి-ఎడమ కాంబినేషన్‌ కోసం మీరు ప్రయత్నించారు. కానీ, ఇది ఒక దశ వరకు మాత్రమే బాగుంటుంది. అంతేకానీ, దూబే స్థానంలో హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడం మాత్రం సరైన నిర్ణయం కాదు’ అని దినేశ్ వ్యాఖ్యానించాడు. ఆరో డౌన్‌లో వచ్చిన హర్షిత్ 13 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన దూబే (2) కూడా ఎక్కువసేపు నిలవలేదు.


మరోవైపు టీమిండియా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ తీరుపై ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. గత ఐదు టీ20ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లోనూ బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చింది. బ్యాటర్లలో ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని ఫ్యాన్స్‌ కామెంట్లు చేశారు. 2009 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘమైన ఓటముల పరంపర కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఓటమిపై స్పందించిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

వైభవ్ సూర్యవంశీతో ఇప్పుడు స్కోర్ సమం అయింది: జోఫ్రా ఆర్చర్

Updated Date - Jul 08 , 2026 | 04:26 PM