విఫమైనప్పటీకి జట్టులో మార్పులు వద్దు: అనిల్ కుంబ్లే
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:46 PM
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న(మంగళవారం) జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఫలితంగా సిరీస్‌లో 0–2తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టులో తరచూ మార్పులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఓ స్పోర్ట్స్ షోలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. తుదిజట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని తాను భావిస్తున్నానని, అలా చేస్తేనే జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించగలరని అన్నాడు. ఇక తిలక్ వర్మ.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్, అతడికి ఓ బాధ్యత అప్పగించారని, కాబట్టి అతడికి మరొక్క అవకాశం ఇవ్వాలని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. మన బౌలర్లు కూడా తమ ఆట తీరును మార్చుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు.
టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట.. ఇంగ్లండ్ జట్టు మాత్రం 76 పరుగులకే ఆలౌట్ చేసిందని వెల్లడించాడు. ప్రణాళికలు, వ్యూహాలు పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాలని అనిల్ కుంబ్లే హితవు పలికాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో టీ20లో 24 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మంగళవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉంటే.. తొలి టీ20లో ఆడిన సంజూ శాంసన్‌పై వేటు వేసిన మేనేజ్‌మెంట్.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని కొనసాగిస్తోంది. ఇక రెండో టీ20లో విఫలమైన రవి బిష్ణోయ్‌ని తప్పించి.. అతడి స్థానంలో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించింది. బ్రిస్టల్ వేదిక ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరగనుంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీతో ఇప్పుడు స్కోర్ సమం అయింది: జోఫ్రా ఆర్చర్
నా జీవితంలోనే అత్యుత్తమ పుట్టినరోజు కానుక ఇది: సౌరభ్ గంగూలీ