వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్‌కు కీలక బాధ్యత
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:38 PM
టీమిండియా క్రికెట్ దిగ్గజం, విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భారత దేశవాళీ క్రికెట్‌లో మరో కీలక ముందడుగు వేశాడు. 2026-27 దేశవాళీ సీజన్‌కు గాను ప్రతిష్ఠాత్మక వినూ మన్కడ్ ట్రోఫీ వన్డే టోర్నీలో పాల్గొనే ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం, విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భారత దేశవాళీ క్రికెట్‌లో మరో కీలక ముందడుగు వేశాడు. 2026-27 దేశవాళీ సీజన్‌కు గాను ప్రతిష్ఠాత్మక వినూ మన్కడ్ ట్రోఫీ వన్డే టోర్నీలో పాల్గొనే ఢిల్లీ అండర్-19 జట్టు కెప్టెన్‌గా 18 ఏళ్ల ఆర్యవీర్ ఎంపికయ్యాడు. తన తండ్రిలాగే ఓపెనర్‌గా రాణిస్తున్న ఆర్యవీర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకోవడంలో ఆర్యవీర్ కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లలో (28, 47, 34 పరుగులు) స్థిరమైన ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ సిరీస్ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఢిల్లీ జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు.
అంతకుముందు.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో (DPL) వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడి సత్తా చాటిన ఆర్యవీర్, 2024 కూచ్ బిహార్ ట్రోఫీలో మేఘాలయపై ఏకంగా 297 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి వెలుగులోకి వచ్చాడు. మైదానంలో నిలకడైన బ్యాటింగ్, దూకుడుగా ఆడే నైపుణ్యంతో తండ్రి వారసత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా ఢిల్లీ జట్టును విజేతగా నిలిపి, త్వరలోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాలని ఈ యువ ఓపెనర్ భావిస్తున్నాడు.
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!