Share News

గాయాలు మానేందుకు తేనె.. లష్కరే ఉగ్రవాదుల చికిత్స

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:26 PM

అడవిలో తలదాచుకునే ఉగ్రవాదులు తమ గాయాలకు తేనెతో చికిత్స చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు

గాయాలు మానేందుకు తేనె.. లష్కరే ఉగ్రవాదుల చికిత్స

ఇంటర్నెట్ డెస్క్: అడవిలో తలదాచుకునే ఉగ్రవాదులు తమ గాయాలకు తేనెతో చికిత్స చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల కశ్మీర్‌లో లష్కరే తయ్యిబా ఉగ్రవాది, పాకిస్థాన్ సైన్యానికి చెందిన ‘స్పెషల్ సర్వీసెస్ గ్రూప్’ మాజీ కమాండో మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హషీం మూసాను భద్రతాదళాలు హతమార్చాయి. అయితే ఈ మూసా గతంలో తన గాయాలకు తేనెతో వైద్యం చేసుకున్నాడని తెలుస్తోంది. అప్పట్లో ‘ఆపరేషన్ షేరువాలీ’ పేరిట జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు గాయాలతో తప్పించుకున్నాడు. మూసా శరీరానికి బులెట్లు తగిలాయి.


ఆ సమయంలో మూసా తన గాయాలకు తేనె పూసుకుని చికిత్స చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు తేనే ఉపయోగించాడని తెలిపారు. ఓ ఉగ్రవాది మొబైల్‌లో ఈ చికిత్స చేస్తున్న చిత్రాలు లభించాయి. మూసా గాయాలకు తేనె రాస్తున్న చిత్రాలను ఆ ఉగ్రవాది పాకిస్థాన్‌ హ్యాండ్లర్లకు పంపినట్టు అధికారులు గుర్తించారు. ‘గాయాలు త్వరగా మానాలంటే స్వచ్ఛమైన తేనె వాడండి’ అని ఆ హ్యాండ్లర్లు ఉగ్రవాదులకు సలహా ఇచ్చారట.


కాగా గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారుల్లో హషీం మూసా ఒకడు. అతడు పదికిపైగా ఉగ్రదాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సమాచారం. 2023లో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో మూడు ఘటనల్లో 14 మంది భారత సైనికులను మూసా బలి తీసుకున్నాడు. 2024 అక్టోబరులో గాందర్‌బల్‌లోని ఓ సొరంగ నిర్మాణ శిబిరంపై దాడి చేసి ఏడుగురి ప్రాణాలు తీశాడు. ఇలాంటి ఉగ్రవాదిని భారత సైన్యం కశ్మీర్‌లోని బద్గాం జిల్లా యూస్‌మార్గ్‌లో బుధవారం జరిగిన ఎనకౌంటర్‌లో హతమార్చింది.


ఈ వార్తలూ చదవండి

సైనికుడి పార్థివదేహాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి

భారత్ అణు శక్తి బలోపేతం.. 190 వార్‌హెడ్‌లు, మూడు మార్గాల్లో వ్యూహాత్మక సామర్థ్యం

Updated Date - Oct 04 , 2026 | 08:29 PM