Share News

ఇండియా కూటమిలోకి టీవీకే.. విజయ్ ప్రధాని అభ్యర్థిత్వం ప్రచారానికి బ్రేక్ పడనుందా..

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:41 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ జాతీయ రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తాజాగా ఇండియా కూటమిలో చేరింది.

ఇండియా కూటమిలోకి టీవీకే.. విజయ్ ప్రధాని అభ్యర్థిత్వం ప్రచారానికి బ్రేక్ పడనుందా..
INDIA Bloc

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ జాతీయ రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తాజాగా ఇండియా కూటమిలో చేరింది. అక్టోబర్ 3న చెన్నైలో జరిగిన ఇండియా కూటమి తమిళనాడు భాగస్వామ్య పార్టీల సమావేశంలో టీవీకే తరఫున ఆ పార్టీ నేతలు ఆధవ్ అర్జున, మరియా విల్సన్ పాల్గొన్నారు (TVK in INDIA Bloc).


కాగా, విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే వర్గాలు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా టీవీకే, ఇండియా కూటమిలో చేరడంతో ఆ ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సిందే. ఎందుకంటే 2029 లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా చూపించాలని ఇండియా కూటమి భావిస్తోంది. దీంతో విజయ్ వర్గం కాస్త వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో డీఎంకే, టీవీకే ప్రత్యర్థులుగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉంటాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది (Vijay PM Face).


కాగా, తమిళనాడులో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో సర్ ప్రక్రియ పైనే ప్రధానంగా చర్చ జరిగింది (2029 Lok Sabha Elections ). ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13, 14 తేదీల్లో జిల్లాల స్థాయిలో, అక్టోబర్ 15న చెన్నైలో నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో టీవీకే కూడా పాల్గొననుంది.


ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..


బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 04 , 2026 | 08:41 PM