Share News

ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందా..

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:39 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (RBI) అక్టోబర్‌లో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల సర్వే వెల్లడించింది.

ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందా..
RBI Repo Rate

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (RBI) అక్టోబర్‌లో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల సర్వే వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం, ముడి చమురు ధరలు అధికంగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రెపో రేటును పెంచే అవకాశం కనిపిస్తోంది (RBI Repo Rate).


ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25 శాతంగా ఉంది. అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరిగే ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటు పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనుంది. ఆర్బీఐ చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 2025 నుంచి వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడి చమురు ధరలు పెరగడం మొదలైనవి ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి (RBI Rate Hike October 2026).


ఒకవేళ ఊహించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును పెంచితే.. గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి (RBI MPC Meeting). దీంతో నెలవారీ చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులతో సమానంగా ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను సవరించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్‌లో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..


బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 04 , 2026 | 07:45 PM