Share News

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:57 PM

బిహార్‌లో వరద బాధితులకు సహాయం అందించే క్రమంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందించే ఏర్పాటు చేశారు.

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..
Bihar Flood

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో వరద బాధితులకు సహాయం అందించే క్రమంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందించే ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ నుంచి కిందకు వదిలిన ప్యాకెట్ ఓ వ్యక్తిపై పడటంతో అతడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బిహార్‌లోని సారణ్ జిల్లాలో జరిగింది (Bihar flood Helicopter Relief).


సారణ్ జిల్లా అమ్నౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరశురాంపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు సహాయ శిబిరాల వద్దకు చేరుకున్నారు. వారికి హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందించారు. ఆ సమయంలో అనిల్ కుమార్ సింగ్ అనే 58 ఏళ్ల వ్యక్తిపై హెలికాప్టర్ నుంచి వదిలిన ప్యాకెట్ పడింది. తలకు తీవ్రంగా గాయం కావడంతో అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు (Relief Packet Death).


ఇదే ప్రాంతంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో ఏర్పడిన గాలి ప్రభావం వల్ల మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది (Bihar Flood News). హెలికాప్టర్ నుంచి వచ్చిన బలమైన గాలికి ఇనుప రేకులు ఎగిరి వెళ్లి ఓ మహిళకు తగిలాయి. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం బిహార్‌లోని పలు ప్రాంతాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 04 , 2026 | 03:08 PM