మీకెందుకు ఇబ్బంది.. స్టాలిన్ 'షూటింగ్' వ్యాఖ్యలకు సీఎం విజయ్ ఘాటు కౌంటర్..
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:43 PM
మిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రజలను నేరుగా కలుస్తూ ప్రచారం చేయడంపై స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రజలను నేరుగా కలుస్తూ ప్రచారం చేయడంపై స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేశారు. వారికి విజయ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు (Vijay vs MK Stalin).
'నేను ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలిసే వ్యక్తిని కాదు. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నా ప్రజలను కలుస్తాను. మీకు ఇబ్బంది ఏమిటి?' అని విజయ్ ప్రశ్నించారు. రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో విజయ్ మదురాంతంగం, ధారాపురం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడటంతో పాటు టీ దుకాణాల్లో టీ తాగడం, ట్రాక్టర్ నడపడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రచార శైలిపై డీఎంకే నేతలు విమర్శలు చేశారు (Tamil Nadu Politics).
'ముఖ్యమంత్రి మధురాంతంగంలో ఒక షూటింగ్ చేశారు. అందులో టీ తాగే సన్నివేశం ఒకటి ఉంది. టీ తాగిన తర్వాత, వారికి రూ. 500 ఇస్తూ గొప్పలు చెప్పుకున్నారు. ప్రజలు రోజూ టీ కోసం ఎంత చెల్లిస్తారో ఆయనకు తెలుసా?' అని స్టాలిన్ ప్రశ్నించారు (Vijay Campaign). తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌ను విజయ్ ఒక్కసారి మాత్రమే సందర్శించారని, ఇప్పుడు మధురాంతంగానికి మాత్రం రెండుసార్లు వచ్చారని, డీఎంకేను చూసి సీఎం చాలా భయపడుతున్నారని స్టాలిన్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..