అమెరికా ఒంటరి శక్తిగా మారుతోంది.. జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:31 PM
అమెరికా తన విదేశాంగ వైఖరిలో గణనీయమైన మార్పులు చేసుకుంటోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రస్తుతం మరింత ఒంటరి శక్తిగా మారుతోందని, అది ఆ దేశం కావాలని తీసుకున్న నిర్ణయమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తన విదేశాంగ వైఖరిలో గణనీయమైన మార్పులు చేసుకుంటోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రస్తుతం మరింత ఒంటరి శక్తిగా మారుతోందని, అది ఆ దేశం కావాలని తీసుకున్న నిర్ణయమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా-చైనా పోటీ, చైనా ఆర్థిక ఎదుగుదల, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు (US Becoming Lonelier Power).
మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జైశంకర్.. ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలో ప్రధానంగా రెండు పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఒకటి అమెరికా తన వైఖరిని గణనీయంగా మార్చుకోవడం కాగా, మరొకటి చైనా ప్రభావం వేగంగా పెరగడం అని చెప్పారు. అమెరికా తన అంతర్జాతీయ పాత్రను పునఃపరిశీలించుకుంటోందని జైశంకర్ అన్నారు. ఇది అనుకోకుండా జరుగుతున్న పరిణామం కాదని, అమెరికా ఎంచుకున్న విధానంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు (US China Rivalry).
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తున్న మరో ప్రధాన అంశం చైనా ఎదుగుదల అని జైశంకర్ చెప్పారు. ప్రపంచ తయారీ రంగంలో చైనా సుమారు మూడో వంతు వాటాను కలిగి ఉందని, దీంతో అంతర్జాతీయ రాజకీయాలపై ఆ దేశ ప్రభావం క్రమంగా పెరుగుతోందని అన్నారు. అమెరికా, చైనా మధ్య పోటీ ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదని, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోందని అన్నారు (Jaishankar Speech).
ఇక, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రయోజనాలపై మరింత స్పష్టతతో వ్యవహరిస్తున్నాయని జైశంకర్ అన్నారు (India Foreign Policy). ఆయా దేశాలు స్వయం ఆధారితను పెంచుకోవడంతో పాటు, ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడకుండా వివిధ దేశాలతో సంబంధాలను విస్తరించుకుంటున్నాయని తెలిపారు. చాలా దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ భాగస్వాములను ఎంచుకుంటున్నాయని జైశంకర్ అన్నారు. ప్రతి అంశంలో ఒకే విధమైన అభిప్రాయాలు కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా, నిర్దిష్ట అంశాలపై కలిసి పనిచేసే విధానం పెరుగుతోందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..