అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:07 PM
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్‌తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్‌తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక ఎవరికి సాధ్యం కానీ కొన్ని అరుదైన రికార్డులను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో ఫామ్ కోల్పోయిన ఈ పవర్ హిట్టర్, ఐపీఎల్‌లో తిరిగి ఫామ్ అందుకున్నాడు. నిన్న(శనివారం) సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టీ20 ఫార్మాట్‌లో 20 బంతుల్లోపే అత్యధిక సార్లు అర్ధ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అతడు ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు అర్ధ సెంచరీ చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్‌లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అభిషేక్ నిలిచాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కావడం గమనార్హం. అలానే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కూడా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఐపీఎల్‌లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్ (1120 బంతులు) తర్వాతి స్థానంలో శర్మ నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు
మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్