Share News

కోహ్లీ అనుభవం జట్టు విజయాలకు ఉపయోగపడుతుంది: భువనేశ్వర్ కుమార్

ABN , Publish Date - Apr 28 , 2026 | 08:29 PM

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ఇన్‌పుట్స్, తమ జట్టు మైండ్‌సెట్ గురించి మాట్లాడాడు.

కోహ్లీ అనుభవం జట్టు విజయాలకు ఉపయోగపడుతుంది: భువనేశ్వర్ కుమార్
Bhuvneshwar Kumar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 75 పరుగులకే డీసీ ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోర్. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో ఛేదించి ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ఇన్‌పుట్స్, తమ జట్టు మైండ్‌సెట్ గురించి మాట్లాడాడు.


‘ఇప్పటి వరకు కోహ్లీ ఏం చేశాడో.. నేనేం చేశానో అనేది అవసరం లేదు. ఐపీఎల్‌లో పోటీ తీవ్రం. మానసికంగా బలంగా ఉండాలి. ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ సహచర క్రికెటర్లకు సూచనలు ఇస్తాడు. అది చిన్నవే కావొచ్చు.. కానీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. విరాట్ చేసిన సూచనల్లో చాలా వరకు వర్కౌట్ అవుతాయి. అతడు ఏం మాట్లాడాడు? ఏం చెప్పాడు? అనేదే ముఖ్యం. బ్యాటింగ్‌లో ఉన్న అనుభవంతో ఏదైనా చెప్పాడంటే మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. నేనెప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనను చూడను. ఏదైనా సరే జట్టుగా గెలుస్తామని చెబుతా. ఫలితంతో సంబంధం లేకుండా ఎవరైనా మన ప్రదర్శనను అభినందిస్తే బాగుంటుంది. మన బౌలింగ్ బాగుండి.. అవతల ఎండ్ నుంచి వేసే బౌలర్ వికెట్ తీసినా కూడా ఆనందమే. జట్టు గెలవడమే మా అందరి అంతిమ లక్ష్యం’ అని భువనేశ్వర్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ

Updated Date - Apr 28 , 2026 | 08:30 PM