Share News

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:23 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఉపన్యాసంతో యువతకు మార్గదర్శిగా నిలిచాడు. న్యూ ఢిల్లీలోని డీపీఎస్ ఆర్కేపురంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి కోహ్లీ హాజరయ్యాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఉపన్యాసంతో యువతకు మార్గదర్శిగా నిలిచాడు. న్యూ ఢిల్లీలోని డీపీఎస్ ఆర్కేపురంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి కోహ్లీ హాజరయ్యాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు. జీవితంలో బాల్యం గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు పాఠశాలల్లో ప్రసంగించే అలవాటు లేదు. చాలా ఏళ్ల కిందట స్కూల్ వాతావరణానికి దూరమయ్యా. స్కూల్ అనేది కేవలం చదువు నేర్పే స్థలం కాదు. ఇది వ్యక్తిత్వ వికాసానికి పునాది. మీరు ఇక్కడ నేర్చుకోవడానికి, ఎదగడానికి వస్తారు. ఈ వాతావరణాన్ని ప్రతి విద్యార్థి గౌరవించాలి. గురువులు తమ సగం జీవితాన్ని విద్యార్థుల కోసమే అంకితం చేస్తారు. మీరు గొప్ప స్థాయిలో ఉండాలని వారు తాపత్రయ పడతారు. అందుకే టీచర్లకు గౌరవం ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను చిన్నతనంలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఆ నిర్ణయం పూర్తిగా నిజాయతీతో తీసుకున్నాను. అందుకే జీవితంలో సక్సెస్ అవ్వగలిగాను. మీరు కూడా మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి. మీరు ఎంచుకున్న మార్గంపై పూర్తి కట్టుబాటుతో ముందుకు సాగండి’ అని విద్యార్థులకు కోహ్లీ కీలక సూచనలు చేశాడు.


అరుదైన మైలురాయి..

ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. కాగా ఆర్సీబీ ఆడిన 8 మ్యాచుల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్

ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!

Updated Date - Apr 28 , 2026 | 03:57 PM