Share News

నా రీఎంట్రీని అడ్డుకుంటున్నారు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వినేశ్ ఫొగాట్ ఆరోపణలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:32 PM

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన వినేశ్.. గత డిసెంబర్‌లో తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే రెజ్లింగ్‌లో తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వినేశ్ తీవ్ర ఆరోపణలు చేసింది.

నా రీఎంట్రీని అడ్డుకుంటున్నారు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వినేశ్ ఫొగాట్ ఆరోపణలు
Vinesh Phogat

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించిన వినేశ్.. గత డిసెంబర్‌లో తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. 2028 ఒలింపిక్స్‌‌లో గెలవడమే తన లక్ష్యమని తెలిపింది. అయితే రెజ్లింగ్‌లో తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వినేశ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాతో మాట్లాడింది.


‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేషన్ తుది గడువు ఏప్రిల్ 30 వరకు ఉంది. కానీ రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. గడువు ముగిసిందని చూపిస్తోంది. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI)లోని పాలనా యంత్రాంగాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించాను. కానీ వారు నా కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం లేదు. ఫెడరేషన్ కప్‌లోనూ పాల్గొందామనుకున్నాను. కానీ అక్కడ చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చారు. దాంతో నేను ఆడలేకపోయాను. నన్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని అనిపిస్తోంది. ఆసియా గేమ్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్ సెలక్షన్ ట్రయల్స్‌ పోటీలో ఉండాలంటే ఈ టోర్నమెంట్ ఎంతో కీలకం’ అని వినేశ్ ఆరోపించింది.


మేం ఎవరినీ అడ్డుకోం: రెజ్లింగ్ ఫెడరేషన్

వినేశ్ ఫొగాట్ ఆరోపణలను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సంజయ్ సింగ్ ఖండించారు. ‘చాలా మంది రెజ్లర్లకు రిజిస్ట్రేషన్ విషయంలో సమస్యలు తలెత్తాయి. వారు మా సిబ్బందిని ప్రశ్నించి సమస్యను పరిష్కరించుకున్నారు. రెజ్లింగ్‌లో పోటీ పడకుండా మేం ఎవరినీ అడ్డుకోం. టోర్నమెంట్ అందరికీ అందుబాటులో ఉంటుంది’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్

ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!

Updated Date - Apr 28 , 2026 | 02:37 PM