Share News

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ బౌలర్

ABN , Publish Date - Apr 28 , 2026 | 10:46 AM

ఐపీఎల్ 2026 ఆరంభంలో మంచిగా విజయాలను అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు అభిమానులకు భారీ ఊరట లభించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ బౌలర్
Mitchell Starc return DC

స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతోనే ఐపీఎల్ 2026ను ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ముంబైపై గెలిచి.. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత నుంచి వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆ జట్టు స్టార్ బౌలర్లు గాయాలతో దూరం కావడంతో భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేక ఓటమి పాలవుతోంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడింది.


ఢిల్లీ వరుస పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) జట్టులో చేరనున్నాడు. మే 1 నుంచి స్టార్క్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ధ్రువీకరించాడు. నిన్న(సోమవారం) రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం అక్షర్ మాట్లాడుతూ.. ' స్టార్క్‌కు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించింది. రాబోయే మ్యాచ్‌ల్లో అతను ఆడే అవకాశం ఉంది. అతని పనిభారాన్ని పర్యవేక్షిస్తూ తుది జట్టులోకి తీసుకుంటాము' అని అక్షర్ పటేల్ తెలిపాడు.


స్టార్క్ రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుందని అక్షర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత గాయం కారణంగా స్టార్క్ ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించి ఢిల్లీ జట్టులో చేరాడు. నిన్న(సోమవారం) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 75 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ఏడో స్థానానికి పడిపోయిన ఢిల్లీ జట్టుకు, స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ చేరిక రాబోయే మ్యాచ్‌ల్లో కీలకంగా మారనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా కోహ్లీ

బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు కీలక పదవి

Updated Date - Apr 28 , 2026 | 11:44 AM