ఐపీఎల్‌పై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:25 PM
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక విషయంతో వార్నర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. తాజాగా ఐపీఎల్‌పై వార్నర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతడికి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్నర్ సైతం ఆరెంజ్ ఆర్మీని అంతే ప్రేమించాడు. కెప్టెన్‌గా 2016లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీ అందించిన వార్నర్.. 2024లో చివరగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
పీఎస్ఎల్ 2026లో వార్నర్ కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పీఎస్‌ఎల్ 2026 ఆరంభంలో కరాచీ జట్టు వరుస విజయాలు సాధించినా.. ఆ తర్వాత పరాజయాలతో చతికిలపడింది. ఫలితంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి వార్నర్ ఉద్వేగపూరిత పోస్టు పెట్టాడు. 'మనం ఎంతో కష్టపడినా ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఆట పట్ల మన అంకితభావం, నిబద్ధత ఎలా ఉందో నాకు తెలుసు. జట్టుగా మనం ఎంతో సాధించాము. కరాచీ జట్టు అభిమానులకు ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. మాకు భద్రత కల్పించిన పోలీసులకూ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అని వార్నర్ పోస్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలో ఓ భారత నెటిజన్.. ‘నువ్వు పీఎస్‌ఎల్ వదిలేసి ఐపీఎల్‌లోకి తిరిగి రావడం మంచిది’ అని కామెంట్ చేశాడు. ‘ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు’ అంటూ వార్నర్ రిప్లయ్ ఇచ్చాడు. గట్టిగానే కౌంటర్ ఇచ్చావంటూ పాకిస్థాన్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారత క్రికెట్ అభిమానులు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ‘ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత వార్నర్ ఐపీఎల్ కోచ్‌గా వస్తాడే కానీ.. పీఎస్‌ఎల్‌లో ఉండడు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టే అక్కడ ఉన్నాడు’ అని చురకలు అంటించారు. ప్రస్తుతం వార్నర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్
ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!