Share News

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:31 PM

ఢిల్లీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బస చేసిన హోటల్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ కోసం ఓ పిల్లాడు కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్
Virat Kohli fan incident

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ డైమండ్ విరాట్ కోహ్లీకి అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. అతడ్ని ఒక్కసారైనా కలవాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. కోహ్లీ కోసం అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ కోసం ఓ పిల్లాడు ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం...


నిన్న( సోమవారం) రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విధించిన స్వల్ప లక్ష్యాన్ని 81 బంతులు మిగిలుండగానే అలవోకగా ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. ఇక మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హోటల్‌కు వచ్చినప్పుడు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ఓ పిల్లాడు బ్యాట్ పట్టుకుని ఆనందంగా పరుగెత్తాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో కోహ్లీని కలవలేకపోయాడు.


ఆ సమయంలో విరాట్ ఆ పిల్లాడిని గమనించక హడావుడిగా వెళ్లిపోయాడు. కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ఆ బాలుడు కొంతదూరం పరుగెత్తాడు. అయినప్పటికీ ఆ బాలుడు అనుకున్నది జరగలేదు. దీంతో ఆ అభిమాని నిరాశతో వెనుదిరిగాడు. ఆటోగ్రాఫ్ దక్కలేదనే కారణంతో బ్యాట్‌ విసిరి వేస్తూ, గట్టిగా ఏడ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వార్నీ.. ఏంటి కోహ్లీ చిన్నపిలాడ్ని అలా ఏడిపించావు అంటూ సెటైర్లు వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ బౌలర్

Updated Date - Apr 28 , 2026 | 02:12 PM