Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:14 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
Punjab Kings vs Rajasthan Royals

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచులోనూ ఓడలేదు. ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరు గెలవగా, ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా పంజాబ్ బ్యాటర్లు అలవోకగా ఛేదించి అద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నారు. మరోవైపు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచిన రాజస్థాన్.. నాలుగో స్థానంలో ఉంది. ఈ పోరులో పంజాబ్ దూకుడుకు ఆర్ఆర్ చెక్ పెడుతుందా? అనేది చూడాల్సి ఉంది.


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

రియాన్ పరాగ్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, డాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రవి బిష్ణోయ్, రవి సింగ్, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబె, హిట్‌మేయర్


పంజాబ్ కింగ్స్ తుది జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానోలి, సుయాంశ్, నేహాల్ వధేరా, మార్కస్ స్టొయినిస్, యాన్సెన్, ఫెర్గుసన్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విష్ణు వినోద్, విజయ్ కుమార్ వైశాఖ్, బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్


ఇవి కూడా చదవండి:

జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ

Updated Date - Apr 28 , 2026 | 07:14 PM