నేను కూడా చాలాసార్లు రైలులో ప్రయాణం చేశాను: రవిచంద్రన్ అశ్విన్
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:21 PM
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ శివం దూబే రైలు ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ శివం దూబే రైలు ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విమానాలు అందుబాటులో లేకపోవడంతో తమ పిల్లలను వెంటనే చూడాలన్న ఉద్దేశంతో థర్డ్ ఏసీ బుక్ చేసుకుని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు రైలులో వెళ్లినట్టు దూబే వెల్లడించాడు. అభిమానుల కంట పడకుండా క్యాప్, మాస్క్ ధరించి అప్పర్ బెర్త్‌లో పడుకున్నట్టు.. ఈ ప్లాన్ అంతా తన భార్య అంజుమ్‌దేనంటూ చెప్పాడు. దీనికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
‘శివం దూబే రైలు ప్రయాణం చేసినట్టు వచ్చిన వార్తలను నేను కూడా చూశాను. కానీ వాటిని చదవడానికి అంతగా ఇష్టపడలేదు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు. నేను కూడా ఎన్నోసార్లు రైలులో ప్రయాణించాను. అంతర్జాతీయ క్రికెటర్లు టీ దుకాణాల దగ్గర సాధారణ ప్రజలతో కలిసి టీ తాగితే ఎంత బాగుంటుంది. అలాంటి చిన్నచిన్న పనుల్లోనే ఎంతో ఆనందం ఉంటుందన్న విషయాన్ని మేం మర్చిపోయాం’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు
విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్