Share News

కాబూల్‌ ఘటన.. బాధితులను పరామర్శించిన అఫ్గాన్ క్రికెటర్లు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:51 PM

కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని అఫ్గానిస్థాన్ జాతీయ జట్టులోని పలువురు క్రికెటర్లు పరామర్శించారు.

కాబూల్‌ ఘటన.. బాధితులను పరామర్శించిన అఫ్గాన్ క్రికెటర్లు
Afghanistan cricketers

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 400 మంది మృతి చెందగా.. 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడిని ఇప్పటికే అఫ్గానిస్థాన్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని అఫ్గానిస్థాన్ జాతీయ జట్టులోని పలువురు క్రికెటర్లు పరామర్శించారు.


అఫ్గానిస్థాన్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ హస్మతుల్లా షాహిది, గుల్బాదిన్ నైబ్, ఖైస్ అహ్మద్, వజీర్ అక్బర్ ఖాన్ బాధితులను పరామర్శించి వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులకు చికిత్స అందిస్తోన్న ఆసుపత్రిపై పాక్ దాడులు జరిపింది. పవిత్ర రంజాన్ మాసంలో అమాయక ప్రజల ప్రాణాలను తీశారంటూ పలువురు క్రికెటర్లు పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

Updated Date - Mar 19 , 2026 | 12:51 PM