చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసిన మహిళ.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:54 PM
చీరకట్టులో ఓ మహిళ పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌ను తలపించేలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చీరకట్టులో ఓ మహిళ పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌ను తలపించేలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కంటెంట్ క్రియేటర్ కోమల్ కుమారి చేసిన ఈ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మైఖేల్ ఐకానిక్ హిట్ ‘బిల్లీ జీన్’ పాటకు ఆమె డ్యాన్స్ అదరగొట్టింది. సాధారణ దుస్తుల్లోనే డ్యాన్స్ చేయడం కష్టమవుతుంది. కానీ మూన్‌వాక్, రోబోటిక్ పాపింగ్, బాడీ ఐసోలేషన్ వంటి క్లిష్టమైన స్టెప్పులను చీరకట్టులోనే ఎంతో సులువుగా చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియోను సరదా స్కిట్ తరహాలో రూపొందించారు. ‘మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా విడుదలైన ‘మైఖేల్’ మూవీ చూసిన తర్వాత ఆ పాప్ లెజెండ్ డ్యాన్స్‌కు వీరాభిమానిగా మారితే ఎలా ఉంటుంద’నే కాన్సెప్ట్‌తో ఈ వీడియోను చిత్రీకరించారు. హాస్యాన్ని, నృత్య ప్రతిభను కలగలిపిన ఈ కాన్సెప్ట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చీర కట్టుకున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా, లయబద్ధంగా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోపై నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆమె నిజంగా అద్భుతమైన డ్యాన్సర్’, ‘మైఖేల్ జాక్సన్ స్వయంగా చూస్తే మెచ్చుకునేవాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సెరెనా విలియమ్స్ రీఎంట్రీ.. సోదరి వీనస్‌తో వింబుల్డన్‌లో బరిలోకి!
నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు