Share News

అరుదైన స్పూన్లు

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:28 PM

అమెరికాకు చెందిన కామెల్లియా పోల్‌ దృష్టిలో స్పూన్‌ అంటే తినడానికి వాడేది మాత్రమే కాదు... అదొక జ్ఞాపకం, ఒక అపురూప కళాఖండం.

అరుదైన స్పూన్లు

అమెరికాకు చెందిన కామెల్లియా పోల్‌ దృష్టిలో స్పూన్‌ అంటే తినడానికి వాడేది మాత్రమే కాదు... అదొక జ్ఞాపకం, ఒక అపురూప కళాఖండం. బామ్మ ఇచ్చిన చిన్న కానుకతో మొదలైన ఆమె ప్రయాణం... నేడు 38,162 స్పూన్ల సేకరణతో ‘గిన్నిస్‌’ రికార్డు సృష్టించే వరకు సాగింది.

కామెల్లియా ఆర్మీ ట్రైనింగ్‌కు వెళ్లేముందు ఆమె బామ్మ ఒక బాక్సు ఇచ్చి ‘నువ్వు సొంతిల్లు కొనేదాకా దీన్ని తెరవొద్దు’ అని కండీషన్‌ పెట్టారట. రెండేళ్ల తర్వాత కామెల్లియా తన సొంతింటికి వెళ్లాక ఆ బాక్స్‌ తెరచి చూస్తే... అందులో 127 వెండి స్పూన్లు ఉన్నాయి. అప్పటికే ఆమె బామ్మ మరణించడంతో, ఆ వెండి స్పూన్ల మెరుపులో తన బామ్మ ప్రేమను చూసుకుంది. అప్పటి నుంచి స్పూన్ల సేకరణ ఆమెకొక అభిరుచిగా మారింది.


book9.2.jpgఇందుకోసం అమెరికాలోని ప్రతీ నగరాన్ని గాలించడమే కాకుండా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఈజిప్ట్‌, రష్యా వంటి దేశాలకు కూడా వెళ్లింది. దాదాపు 10 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఇప్పటిదాకా 38,162 స్పూన్లను పోగు చేసి (గత 36 ఏళ్లుగా) ‘ఔరా’ అనిపించింది. కామెల్లియా వద్ద ఉన్న అన్ని స్పూన్లను రోజుకు ఒకటి చొప్పున వాడాలంటే 104 ఏళ్ల సమయం పడుతుందట. అయోవాలోని ‘మిసిసిపీ స్పూన్‌ గ్యాలరీ’లోకి అడుగుపెడితే... క్వీన్‌ విక్టోరి యా కాలం నాటి స్పూన్లు, 1891 నాటి ప్రసిద్ధ ‘సేలం విచ్‌ స్పూన్‌’, ఈజిప్ట్‌ మమ్మీ స్పూన్లు, చైనీస్‌ డ్రాగన్‌ స్పూన్లు, పారదర్శక ఎనామెల్‌తో చేసిన ‘ప్లిక్‌-ఎ-జోర్‌’ స్పూన్లు.. ఇలా ఎన్నో అరుదైనవి కనిపిస్తాయి. 130 రకాల వెండి స్పూన్లతో తయారుచేసిన షాండ్లియర్‌నూ చూడొచ్చు.


వార్తలు కూడా చదవండి:

‘మతం’ చిక్కుల్లో జగన్‌!

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2026 | 01:28 PM