Share News

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్మిస్తాం: కేంద్ర మంత్రి వర్మ

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:50 AM

ఆకివీడు పెదపేటలో రామాలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్మించి తీరుతామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్మిస్తాం: కేంద్ర మంత్రి వర్మ

ఇంటర్నెట్ డెస్క్: ఆకివీడు పెదపేటలో రామాలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్మించి తీరుతామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. ఆకివీడు మండలం అజ్జమూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎప్పటి నుంచో అక్కడ రామాలయం ఉంది. ఆ స్థలం వివాదాస్పదమైనది కాదు. కూటమి నాయకులపై దాడిని సభ్య సమాజం ఖండిస్తోంది. మతమార్పిడి చేసుకున్న వ్యక్తులే రామాలయం కట్టకూడదని విచిత్రమైన వాదన చేస్తున్నారు. రాముల వారి దర్శనం చేసుకోవాలనుకున్నా. ఉన్నతాధికారులు వద్దని వారించారు. రామాలయ పునర్నిర్మాణంలో అందరూ కలిసిరావాలి’ అని వర్మ అన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 05:51 AM