అసెంబ్లీ భవనాన్నే పేల్చేస్తున్నట్టు ఏఐ వీడియో.. చివరకు
ABN , Publish Date - Oct 22 , 2026 | 08:58 AM
తాజాగా బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సహాయంతో నకిలీ బాంబ్‌బ్లాస్ట్ చేశాడు. ఏకంగా కర్ణాటక అసెంబ్లీ భవనాన్నే పేల్చేస్తున్నట్టు ఫేక్ వీడియో రూపొందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐని దుర్వినియోగం చేస్తూ ఇటీవలి కాలంలో కొందరు కటకటాల పాలవుతున్నారు. ఏఐతో అసభ్య కంటెంట్ రూపొందించి కొంతమంది అరెస్ట్ అవుతుంటే.. నకిలీ వీడియోలు తయారు చేసి మరి కొంతమంది పట్టుబడుతున్నారు. అయితే తాజాగా బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సహాయంతో నకిలీ బాంబ్‌బ్లాస్ట్ చేసి అరెస్ట్ అయ్యాడు. అతడు ఏకంగా కర్ణాటక అసెంబ్లీ భవనం ‘విధాన సౌధ’ను బ్లాస్ట్ చేస్తున్నట్టు ఫేక్ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బెంగళూరు పోలీసుల కంటపడటంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులో నివసిస్తున్న ఆలీ అనే వ్యక్తి ఏఐ సహాయంతో ఓ నకిలీ బ్లాస్టింగ్ వీడియో తయారు చేశాడు. ఆ వీడియోలో అతడు.. తన చేతివేళ్లను తుపాకీలాగా గురిపెట్టి విధాన సౌధను పేల్చేయడం కనిపిస్తోంది. ఈ వీడియోను ఆలీ అక్టోబర్ 20న సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీసులు కూడా ఈ చర్యను తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేసుకుని అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగం పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి
వంటగదిలో మంటలు.. మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్
రావణ దహనంలో అపశ్రుతి.. జనాలపైకి దూసుకొచ్చిన బాణసంచా.. వీడియో వైరల్